logo
Published : 02/12/2021 01:42 IST

‘ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే నిందలు’


డాక్టర్‌ మల్లికా ఘంటి

హొసపేటె, న్యూస్‌టుడే: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవటానికే హంపీ వర్సిటీ ప్రస్తుత ఉప కులపతి డాక్టర్‌ స.చి.రమేశ్‌ తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని విశ్రాంత ఉప ఉపకులపతి డాక్టర్‌ మల్లికా ఘంటి ఆరోపించారు. బుధవారం ఆమె ఇక్కడ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2017లో ఉప కులపతిగా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగ నియామకాలు జరిగాయన్న ప్రస్తుత ఉప కులపతి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 14మంది బోధన, బోధనేతర సిబ్బందిని పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల మేరకే నియమించాను. కల్యాణ కర్ణాటక విద్యార్థులకు న్యాయం చేకూర్చే దిశలో సుమారు 700మందికి పరిశోధనలో అవకాశం ఇచ్చామన్నారు. తన హయాంలో రూ.2.33 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలు ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు. తాను పదవీ విరమణ పొందేనాటికి వర్సిటీలో రూ.21 కోట్లు ఉండేవి. ఆ నిధులను ప్రస్తుత ఉపకులపతి స.చి.రమేశ్‌ అవసరంలేని అభివృద్ధి పనులకు వినియోగించారని ఆమె ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం చొరవ చూపి వర్సిటీలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక విషయాలపై విచారణ చేపట్టాలని ఆమె కోరారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని