logo
Published : 02/12/2021 01:42 IST

పావగడకు నీరు...దేవలాపురకు కన్నీరా?


దేవలాపుర ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ప్రజలు

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం నుంచి తుమకూరు జిల్లా పావగడకు దేవలాపురకు ఎగువున నీటి గొట్టాలు వేసే పనులు జరుగుతున్నాయి. దేవలాపురకు తుంగభద్ర నీటిని అందివ్వడంలేదని ఆ గ్రామస్థులు ఆరోపించారు. బుధవారం నీటిగొట్టాలు వేసే పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టి పనులను నిలిపివేశారు. తుంగభద్ర పక్కనే ఉన్న తమ గ్రామానికి కూడా నీటిని పొందే హక్కు ఉంది. అధికారులు తొలుత తమ గ్రామానికి నీటిని సరఫరా చేసి, అనంతరం పావగడకు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు హామీ ఇచ్చి కొన్ని రోజులు పనులు నిలిపివేశారు. ఇప్పుడు పునఃప్రారంభించడం తగదన్నారు. తమ గ్రామానికి నీరివ్వకుండా పనులు చేపడితే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. డణాయకన కెరె పంచాయతీ ఉపాధ్యక్షుడు ఉప్పార వెంకటేశ్‌, జీపీ సభ్యుడు రమేశ్‌, గ్రామ ప్రముఖులు పరశురామ, హొన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని