logo
Published : 02/12/2021 01:42 IST

బంగారు ముఠాకు కటకటాలు

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ప్రదర్శిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : వ్యాపారిని బెదిరించి రూ.2.25 కోట్ల విలువ చేసే 5.59 కిలోల బంగారాన్ని దోచుకెళ్లిన దుండగుల ఆటకట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను హలసూరు గేట్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సర్వజ్ఞనగర నివాసి మహ్మద్‌ ఫర్హాన్‌, నాగవార మహ్మద్‌ హుసేన్‌, వెంకటేశపుర ప్రాంతంలో ఉంటున్న మహ్మద్‌ ఆరిఫ్‌, అంజుం, కుశాలనగర నివాసి శాహిద్‌ అహ్మద్‌, ఆర్‌టీనగర వాసి ఉమేష్‌, గోవిందపురకు చెందిన సుహేల్‌ బేగ్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ వెల్లడించారు. ఆయన బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. దోపిడీకి ఉపయోగించిన పెద్ద కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ వ్యక్తి ఓ బంగారు విక్రయ- కుదువ సంస్థలో కాపలాదారుడిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సంస్థకు విచ్చేసే వ్యాపారులు, వినియోగదారుల వివరాలను గుర్తించి, ఇతర నిందితులకు సమాచారం చేరవేసేవాడని తేలింది. ఈ సమాచారం ఆధారంగానే ప్రముఖ వ్యాపారి సిద్ధేశ్వర్‌ నవంబరు 19న బంగారు తీసుకెళుతుండగా అడ్డగించి- కత్తులతో బెదిరించి దోచుకుని పరారయ్యారు. ఈ దోపిడీ ఘటనను సవాల్‌గా స్వీకరించిన పోలీసులు చుట్టు పక్కల నిఘా కెమెరాలను పరిశీలించారు. నాగవార, ఆర్‌టీనగర, గోవిందపుర ప్రాంతాల్లో గాలించి నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ అనుచేత్‌ తెలిపారు. కేసును కొలిక్కి తెచ్చిన పోలీసు బృందానికి కమిషనర్‌ కమల్‌పంత్‌ రూ.70వేల నగదు బహుమతి ప్రకటించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని