logo
Published : 02/12/2021 01:42 IST

ఇస్రో సంరక్షణకు ఉద్యమం


పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నేతృత్వంలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ప్రైవేటీకరించరాదంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. బెంగళూరు న్యూ బీఈఎల్‌ రహదారిలోని ఇస్రో కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా విస్తరించిన ఇస్రోలో ప్రస్తుతం 15 వేల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని గుర్తు చేశారు. బెంగళూరు నగరం కేవలం ఐటీ కేంద్రంగానే కాక.. అంతరిక్ష పరిశోధనల వేదికగానూ పేరొందిన విషయాన్ని విస్మరించరాదన్నారు. ఇస్రోలో మానవ రహిత అంతరిక్ష యాన పరిశోధనల విభాగాన్ని గుజరాత్‌కు తరలించే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెండిగా వ్యవహరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కన్నడ సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధమని ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌ శివన్‌ చేసిన ప్రకటనను తప్పుపట్టారు. ఆయన తక్షణమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని విన్నవించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని