logo
Published : 02/12/2021 01:42 IST

‘రైతులు, కార్మికుల పక్షాన ఉంటాం’


బళ్లారిలో కిసాన్‌ విజయ్‌ దివస్‌లో పాల్గొన్న మహ్మద్‌ రఫీక్‌, శ్రీధర్‌ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ నిరంతర పోరాటం సాగించిందని బళ్లారి డీసీసీ అర్బన్‌ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌ రఫీక్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల పక్షాన ఉంటుందన్నారు. నిత్యావసర ధరలు పెరిగి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్‌ సమితి అధ్వర్యంలో బుధవారం స్థానిక కంటోన్మెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద కిసాన్‌ విజయ్‌ దివస్‌ జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సమితి అధ్యక్షుడు శ్రీధర్‌, పార్టీ నాయకులు కల్లుకంబ పంపాపతి, మారెణ్ణ, కుమారమ్మ, యతేంద్రగౌడ, విల్సన్‌, తాయప్ప, కార్పొరేటర్‌ కుబేర తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని