logo
Published : 02/12/2021 01:42 IST

అభినందన పద్మ రత్నాలు!


‘పద్మ’, ఖేల్‌రత్న పురస్కారాల గ్రహీతలతో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ‘పద్మ’, ఖేల్‌ రత్న పురస్కారాలను అందుకున్న కన్నడిగులను గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా సన్మానించి.. అభినందించారు. గాజుమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, యువజన సేవల అధికారిణి షాలిని రజనీష్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి గర్వకారణమైన ప్రముఖులను సత్కరించడం మన ధర్మమని గవర్నర్‌ అన్నారు.
* రాజ్‌భవన్‌ గ్లాస్‌హౌస్‌లో రెడ్‌క్రాస్‌ సంస్థ వార్షిక సమావేశాలను గవర్నర్‌ గహ్లోత్‌ ప్రారంభించారు. ఇటీవలి రోజుల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను కాపాడేందుకు రెడ్‌క్రాస్‌ శ్రమించినట్లు వివరించారు. రక్తదాన శిబిరాల నిర్వహణకు, పరిహార కార్యక్రమాల ఏర్పాటులో ముందంజలో నిలిచిందని ప్రశంసించారు. రాయచూరు, తుమకూరు, దక్షిణ కన్నడ, హాసన, చిత్రదుర్గ, కొప్పళ, బళ్లారి జిల్లా రెడ్‌క్రాస్‌ శాఖలు చేసిన సేవలను ప్రశంసించి, ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది, వాలంటీర్లను సత్కరించారు. సంస్థ సీనియరు సభ్యుడు అప్పారావ్‌ అక్కోణెకు ప్రత్యేక మెరిట్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు.  

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని