logo
Published : 02/12/2021 01:42 IST

నా హత్యకు కుట్ర: విశ్వనాథ్‌


ఎమ్మెల్యే విశ్వనాథ్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భాజపా కీలక నేత, యలహంక శాసనసభ్యుడు, బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) అధ్యక్షుడు ఎస్‌.ఆర్‌.విశ్వనాథ్‌ హత్యకు ప్రత్యర్థులు కుట్ర పన్నారా? వెలుగులోకి వచ్చిన ఆ ఎత్తుగడలపై కలకలం రేగింది. ఈ విషయాన్ని ఆయనే బుధవారం విలేకరులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో నమోదైన కొన్ని నేర వ్యవహారాలకు ప్రతీకారంగా నన్ను హత్య చేసేందుకు పథకం పన్నారని ఆయన ఆరోపించారు. రూ.5 కోట్లు సుపారీ కూడా ఇచ్చారని వివరించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు వివరించి పూర్తి భద్రత కోసం విజ్ఞప్తి చేశానన్నారు.యలహంకకే చెందిన కాంగ్రెస్‌ నేత ఎం.ఎస్‌.గోపాలకృష్ణ తన హత్యకు పథకం రూపొందించారని విశ్వనాథ్‌ ఆరోపించారు. దేవరాజ్‌ అలియాస్‌ కుళ్ల దేవరాజ్‌ అనే రౌడీషీటర్‌తో గోపాలకృష్ణ మాట్లాడినట్లుగా చెబుతున్న సంభాషణల ఆడియోను విశ్వనాథ్‌ విడుదల చేయడంతో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఈ ఆధారంతోనే భద్రత కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని వివరించారు. నిజానికి ఆరు నెలల కిందట జరిగిన ఆ సంభాషణ ఇప్పుడు వెలుగులోకి రావడం చర్చకు తావిస్తోంది. గోపాలకృష్ణ తన ఇంట్లో కూర్చొని విశ్వనాథ్‌ను హత్య చేస్తే రూ.5 కోట్ల సుపారీ ఇస్తానని దేవరాజ్‌కు సూచించినట్లు ఆ సంభాషణ ద్వారా బహీర్గతమైంది. ‘ఎన్నికల్లో విశ్వనాథ్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి విజయం సాధించడం కష్టంగా మారింది. రూ.100 కోట్లు ఖర్చుపెట్టినా గెలుపు అసాధ్యం. ఆయనను తొలగిస్తే రాజకీయంగా నాకు ఎదుగుదల ఉంటుంది. ఆయనను కడతేర్చడానికి షూటర్లను పిలిపించాలి. రూ.5 కోట్లు ఇస్తా. పథకం విఫలం కాకూడదు’ అంటూ గోపాలకృష్ణ ఆ ఆడియోలో చెప్పాడని విశ్వనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గోపాలకృష్ణ పోటీ చేసి ఓడిపోవడం ప్రస్తావనార్హం. విశ్వనాథ్‌ విన్నపంతో స్పందించిన ముఖ్యమంత్రి.. తగిన చర్యల కోసం డీజీపీ ప్రవీణ్‌సూద్, బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. హత్యకు కుట్రపన్నారంటూ రాజనుకుంటె పోలీసుఠాణాలో విశ్వనాథ్‌ ఫిర్యాదు చేశారు. ఆడియో సంభాషణ వైరల్‌ కావడంతో కాంగ్రెస్‌ నాయకుడు గోపాలకృష్ణ, రౌడీషీటర్‌ కుళ్ల దేవరాజ్‌ను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కొద్ది సేపటి తరువాత గోపాలకృష్ణను ఇంటికి పంపగా.. దేవరాజ్‌ విచారణ కొనసాగుతోంది.  

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని