logo
Published : 03/12/2021 00:52 IST

తాగుబోతు చేతిలో వృద్ధుల విషాదాంతం

మైసూరు, న్యూస్‌టుడే : గర్భిణిగా ఉన్న రెండో భార్యపై మద్యం మత్తులో దాడి చేయడంతోపాటు ఎదురింట్లోని వృద్ధ దంపతులను హతమార్చిన సంఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా నవిలూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హతులను నింగమ్మ (50), మాదయ్య (60)గా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఈరయ్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు ఈ నిందితుడు తన భార్యపై దాడి చేశాడన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. విచక్షణ లేకుండా ఆమెను హింసించడమూ ఆందోళనకు గురిచేసింది. నిజానికి ఇటీవలే నిందితుడు తన మొదటి భార్యను హతమార్చిన నేరంపై జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్ఛి. మరో పెళ్లి చేసుకున్నాడని గుర్తించారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండు చేశారు. నంజనగూడు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని అధికారులు వివరించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని