logo
Published : 03/12/2021 00:52 IST

సవాళ్ల మధ్య సువర్ణ సమావేశాలు


సువర్ణసౌధలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉభయసభాపతులు బసవరాజ హొరట్టి, విశ్వేశ్వరహెగ్డే కాగేరి తదితరులు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : కరోనా నియంత్రణ, అతివృష్టి తీవ్రత, పరిషత్తు- పంచాయతీ ఎన్నికల వంటి సంక్లిష్ట పరిస్థితుల నడుమ బెళగావి సువర్ణ సౌధలో విధానసభ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయించారు. దీనికి సర్కారు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఉభయ సభల స్పీకర్లు విశ్వేశ్వరహెగ్డే కాగేరి, బసవరాజ హొరట్టి సూచించారు. వీరు గురువారం సువర్ణసౌధను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తున్న సువర్ణసౌధలో నిర్వహిస్తున్న సమావేశాలకు వసతి, రవాణా సదుపాయాలను కట్టుదిట్టంగా కల్పించాలని విశ్వేశ్వరహెగ్డే కాగేరి ఆదేశించారు. రాష్ట్ర సర్కారు, బెళగావి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ సమావేశాలను సురక్షిత వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఈ సమావేశాలకు సంబంధించిన ఉభయ సభల ఉత్తర్వులు, కార్యకలాపాల పట్టిక, ప్రశ్నోత్తరాలను సిద్ధం చేశామని ప్రకటించారు. విధానసభ, పరిషత్తుల మధ్య విశ్వాసపూరిత వాతావరణంలో బాధ్యతాయుతంగా సమావేశాలు నిర్వహించాలన్నారు. మంత్రులు, వారి వయసుల వారీగా సదుపాయాలు, వారికి అధికారుల సహకారం, వికేంద్రీకరణ విధానాలు పాటించాలన్నారు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో తక్కువ వ్యయంతో సమావేశాలు నిర్వహించాలని ఇదే సందర్భంగా పరిషత్తు స్పీకర్‌ బసవరాజ హొరట్టి అభిప్రాయపడ్డారు. సభ్యులందరికీ బెళగావిలోనే వసతి సదుపాయం కల్పిస్తే సకాలంలో సమావేశాలు ముగించే వీలుందన్నారు. తాలూకా స్థాయిలో ద్వితీయ శ్రేణి అధికారులు, తాలూకా పంచాయతీ సీఈఓలు, పురసభ, పట్టణ పంచాయతీ అధికారులంతా ఈనెల 13నుంచి 24వరకు తమ కార్యాలయాల్లోనే ఉంటూ పాలన వ్యవహారాలపై దృష్టి సారించాలని విధానసభ డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ మామని ఆదేశించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని