logo
Published : 03/12/2021 00:52 IST

ప్రగతిని విస్మరించిన భాజపా


మాజీ ఎమ్మెల్సీ మనోహర్‌ (దళ్‌), మాలూరు మాజీ ఎమ్మెల్యే

నాగరాజు (భాజపా)కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్‌ నేతలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భారతీయ జనతాపార్టీ.. ప్రస్తుతం భ్రష్ట జనతా పార్టీగా మారిపోయిందని విపక్ష కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య నిప్పులు చెరిగారు. బెంగళూరులోని కాంగ్రెస్‌ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మనోహర్‌ (దళ్‌), మాలూరు మాజీ ఎమ్మెల్యే నాగరాజు (భాజపా) తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి స్వాగతం పలికిన నేపథ్యంలో సిద్ధు మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్‌ ఇవ్వనిదే ఈ సర్కారులో పనులు జరగడంలేదని గుత్తేదారులే ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. భాజపా పాలకులే అత్యంత అవినీతిపరులని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించి విచారణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తారని ఆశించినా ప్రయోజనం లేదన్నారు. సమాజంలో చీలిక తెచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారని, పెట్టుబడిదారులకు అండగా నిలిచారని ఆరోపించారు. పీడితులు, రైతులు, మహిళలు, దళితులు, వెనకబడిన వర్గాలపై ఇసుమంతైనా ప్రేమ లేదన్నారు. క్రైస్తవ ప్రార్థన మందిరాల్లోకి ప్రవేశించి దాడులు చేయడం ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రెండు శాతమే క్రైస్తవులు ఉన్నారని, రాజ్యాంగంలో అన్ని మతాలకూ సమాన హక్కు కల్పించినా భాజపా పాలకులు అనుసరించడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రగతి మందగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ జమానాలోని సంక్షేమ పథకాలను కాలరాశారని తప్పుపట్టారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు చేసిన ఆందోళన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో కేంద్రం ఘోర తప్పిదాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ విధానపరిషత్తు ఎన్నికల్లో ఎక్కువ చోట్ల విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ, పీసీసీ కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి, శాసనసభ్యులు నంజేగౌడ, శివణ్ణ, మాజీ మంత్రి చెలువరాయస్వామి తదితరులు పాల్గొన్నారు. దళ్‌ నేతలు అమరనాథ్‌, డాక్టర్‌ కృష్ణ, గోపికృష్ణ, రాష్ట్ర మడివాళ సంఘం అధ్యక్షుడు నంజప్ప తదితరులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని