logo
Published : 03/12/2021 00:52 IST

భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా

కేంద్రానికి ముఖ్యమంత్రి విన్నపం


జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో చర్చిస్తున్న బసవరాజ బొమ్మై

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై దిల్లీ పర్యటనలో కీలకాంశాలపై ఆయా కేంద్ర మంత్రులతో చర్చించారు. జలశక్తి, ఆరోగ్యం, న్యాయ శాఖల మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గురువారం దిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం బెంగళూరుకు పయనమవుతారు.

కేంద్ర మంత్రి హామీ..

భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తాను చేసిన ప్రతిపాదనకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు ఈనెల 6న నిర్వహించే సమావేశంలో రాష్ట్ర ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని మనవి చేసినట్లు చెప్పారు. కృష్ణా ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా కేంద్రం తన అభిమతాన్ని వ్యక్తం చేయాలన్న ఆయన- కృష్ణా ధర్మాసనం ఇచ్చిన నివేదికపై కోర్టు తీర్పును సర్కారు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గోదావరి, కావేరి, కృష్ణా, మహానదుల అనుసంధానంపై డీపీఆర్‌కు ముందుగా రాష్ట్ర వాదన వినాలని కోరారు. కావేరిపై మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చేంత వరకు తమిళనాడులో నదుల అనుసంధానానికి అనుమతి ఇవ్వరాదని తాను చేసిన మనవికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుక్‌ మాండవీయతో సమావేశమైన ముఖ్యమంత్రి.. బూస్టర్‌ డోసుల కోసం చేసిన మనవిని ఆయన సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. నిపుణుల సమితితో చర్చించి బూస్టర్‌ డోసుపై తుది నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇదే సందర్భంగా కేంద్ర ఎరువుల మంత్రి భగవంత ఖూబాతో సమావేశమైన ముఖ్యమంత్రి- రాష్ట్రానికి 48 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరమని కోరారు. అక్టోబరు-నవంబరు మాసానికి కేంద్రం ఇవ్వాల్సిన డీఏపీని త్వరలో విడుదల చేయాలని కోరారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో చర్చించిన ముఖ్యమంత్రి జనవరిలో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. ఆ సందర్భంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని విన్నవించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇదే సందర్భంగా పరిషత్తులో భాజపా, జేడీఎస్‌ల మైత్రిపై మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి నిర్ణయిస్తారని బొమ్మై ప్రకటించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని