logo
Published : 03/12/2021 00:52 IST

ధర్మమే జీవన పథం


సర్వధర్మ సమ్మేళనాన్ని దీపం వెలిగించి ప్రారంభిస్తున్న గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌. చిత్రంలో వీరేంద్ర హెగ్గడే తదితరులు

బెంగళూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే : అన్ని మతాలు, ధర్మాలను గౌరవించినపుడే సామాజిక సామరస్యత, ప్రపంచ శాంతి సాధ్యమని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. ధర్మస్థలలో గురువారం రాత్రి లక్షదీపోత్సవం సందర్భంగా 89వ సర్వధర్మ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ‘బతుకు.. బతకనివ్వు అనేది జైనధర్మ సర్వ శ్రేష్ట సిధ్ధాంతం. సత్యం, ధర్మం, అహింసం, త్యాగం, పరులసేవ ద్వారానే జీవితం సార్ధకం అవుతుందన్న భగవాన్‌ జైన మహావీరుడి మాటలు నేటి తరం మరచిపోకూడదు. ఆ ధర్మపథంలోనే ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్‌ వీరేంద్రహెగ్గడే సేవలు కొనసాగుతున్నాయి. ఇక్కడి సేవలు, ప్రగతి నిరుపమానం’ అని కీర్తించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్‌-వ్యాసా విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఆచార్య రామచంద్రభట్‌ మాట్లాడుతూ పాపాలను ప్రక్షాళనం చేసే ధర్మాలను ఆదరించాలన్నారు. ఎంచుకున్న ధర్మంలోనే సర్వం నిక్షిప్తమై ఉంటుందన్నారు. ధర్మాధికారి డాక్టర్‌ వీరేంద్రహెగ్గడే మాట్లాడుతూ సభ్య సమాజం ఉన్నతంగా ఉండాలని, మన సంస్కృతి నవ్య ప్రగతికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. సేవా-ధర్మాలు ఒకదానికొకటి తోడుగా నిలవాలన్నారు. ధర్మస్థలలో అన్నదానం, విద్యాభివృద్ధి, వైద్యసేవలు, అభయదానాల ప్రత్యేకతలు వివరించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని