logo
Published : 03/12/2021 01:29 IST

నకిలీ పత్రాలతో సైన్యంలో చేరిన వ్యక్తి అరెస్టు

పోలీసుల అదుపులో మరికొందరు


అజిత్‌ కోండే

హొసపేటె, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సృష్టించి సైన్యంలో చేరిన మహారాష్ట్ర వాసి అజిత్‌ కోండేను విజయనగర జిల్లా హిరేహడగలి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారంతో మరికొందరిని బంధించారు. వారిలో ఇద్దరు బళ్లారి కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. గురువారం విజయనగర జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.అరుణ్‌ ఈ నకిలీ వ్యవహారాన్ని విలేకరులకు వివరించారు. నిందితుడు అజిత్‌ కోండే విజయనగర జిల్లా హిరేహడగలి తాలూకా అరవి గ్రామస్థునిగా ఆధార్‌, ఓటరు కార్డు, ఇతర నకిలీ పత్రాలను సృష్టించి సైన్యంలో నియామకానికి అర్హత సాధించాడు. సైనికాధికారులు అతని దాఖలాలను పరిశీలనకు హిరేహడగలి పోలీస్‌ స్టేషన్‌కు పంపగా, అరవి గ్రామంలో అలాంటి వ్యక్తి ఎవరూ లేరని తేలింది. కూపీ లాగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు నకలీ దాఖలాలు సృష్టిస్తున్న బళ్లారివాసులు మనోజ్‌, పరశురామ, వెంకటేశ్‌, జంబణ్ణ, బెళగావి జిల్లా అథణికి చెందిన వైభవ్‌ సాంబాజి మకాళె, నేతాజిరామ్‌ సావంత్‌, హుబ్బళ్లి వాసి మంజునాథ్‌ గోడ్కేలను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహాయం చేశారన్న ఆరోపణపై బళ్లారికి చెందిన కానిస్టేబుళ్లు కె.అంకలేశ్‌, రామాంజనేయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సైన్యంలో చేరేందుకు ఈ తొమ్మిది మంది ద్వారా పలు రాష్ట్రాలకు చెందిన పదిమంది నకిలీ ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్టు దర్యాప్తులో తేలిందని ఎస్పీ వివరించారు. వారిలో ఇప్పటికే ఆరుగురు సైన్యంలో పనిచేస్తున్నారు. మరో నలుగురు సరైన దాఖలాలు ఇవ్వలేదంటూ సైనికాధికారులు తిరస్కరించారు. పది మంది వివరాలు తెలిశాయి. ఉన్నతాధికారులతో చర్చించి వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని