logo
Updated : 03/12/2021 10:18 IST

27ఏళ్ల చందన.. ఇప్పుడు ‘సాధ్వి ప్రియ దిశాంజన’గా..


గుజరాత్‌లో సాధ్విగా మారిన అనంతరం ధన్యవాదాలు తెలుపుతూ సాగుతున్న చందన

సింధనూరు, న్యూస్‌టుడే: అహింసా బోధనే లక్ష్యంగా..అదే మోక్ష మార్గంగా ఎంచుకుని గురువారం తెల్లవారుజాము అయిదు గంటలకు గుజరాత్‌లోని పుణ్యక్షేత్రమైన పాలితానలో సింధనూరు (కర్ణాటక)కు చెందిన 27 ఏళ్ల యువతి చందన.. జైన్‌ సాధ్వి (సన్యాసిని)గా మారిపోయారు. ఏడాది కిందట ఈ నిర్ణయం తీసుకున్న చందనకు అన్నిచోట్లా వీడ్కోలు కార్యక్రమాలు కొనసాగాయి. నెల రోజులుగా అనేక ప్రాంతాల్లో వీడ్కోలు వేడుకలను తలపించాయి. సాధ్వి దీక్ష నేపథ్యంలో కుటుంబ సభ్యులు వారం కిందటే గుజరాత్‌ చేరుకున్నారు. గుజరాత్‌లోని పాలితానలో జైన ధర్మానికి చెందిన ఆదేశ్వర తీర్థాంకర్‌ మోక్షం పొందిన పవిత్ర స్థలమైన సిద్ధపర్వత క్షేత్రంలో దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

గురువారం తెల్లవారుజామున చందన తొలుత తీర్థంకరులను ప్రార్థించారు. శిరోమండనం వంటి దీక్షా క్రియల అనంతరం ఆమెకు క్షేత్ర గురువులు పవిత్ర సాధ్వి దుస్తులు అందించారు. అవి ధరించిన చందన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు చందన పేరును మార్చి.‘సాధ్వి ప్రియ దిశాంజనశ్రీ’ అని నామకరణం చేశారు. వందల సంఖ్యలో భక్తులు, బంధువుల జేజేల నడుమ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చందన..ప్రియదిశాంజనగా అహింసా బోధన దిశగా సాగిపోయింది.

సన్యాస దీక్షకు ముందు సింధనూరులో వీడ్కోలు వేడుకలో..

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని