logo

వర్షాలకు పడిపోయిన పాఠశాల గదులు

ఇటీవల కురిసిన అధిక వర్షాలకు తాలూకాలోని హళె నెల్లుడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఐదు గదులు దెబ్బతిన్నాయి. కంప్లి తహసీల్దార్‌ గౌసియా బేగం, కురుగోడు విద్యాశాఖ అధికారి వెంకటేశ్‌ రామచంద్రరావు శనివారం గ్రామానికి వచ్చి పాఠశాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు

Published : 05 Dec 2021 01:44 IST


పడిపోయిన గదులను పరిశీలిస్తున్న అధికారులు

కంప్లి, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు తాలూకాలోని హళె నెల్లుడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఐదు గదులు దెబ్బతిన్నాయి. కంప్లి తహసీల్దార్‌ గౌసియా బేగం, కురుగోడు విద్యాశాఖ అధికారి వెంకటేశ్‌ రామచంద్రరావు శనివారం గ్రామానికి వచ్చి పాఠశాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు కరి బసవనగౌడ మాట్లాడుతూ విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున వెంటనే నూతన గదులు, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రత్యేక భవనం నిర్మించాలని అధికారులను కోరారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ గదుల నిర్మాణం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అంగన్‌వాడీ కేంద్రాన్ని తాత్కాలికంగా సముదాయ భవనంలో కొనసాగిస్తామని తెలిపారు. ఉప తహసీల్దార్‌ రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని