logo

‘సిద్ధులాంటి పాలన వారికి సాధ్యమా’?

అన్నభాగ్య, క్షీరభాగ్య వంటి అనేక ప్రజాసంక్షేమ పథకాలతో మాజీ సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి పాలన యడియూరప్ప, బసవరాజ బొమ్మైలకు సాధ్యమా? అని మాజీ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ ప్రశ్నించారు. విధానపరిషత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Published : 05 Dec 2021 01:44 IST


మల్లదగుడ్డక్యాంపులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాదర్లి

సింధనూరు, న్యూస్‌టుడే: అన్నభాగ్య, క్షీరభాగ్య వంటి అనేక ప్రజాసంక్షేమ పథకాలతో మాజీ సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి పాలన యడియూరప్ప, బసవరాజ బొమ్మైలకు సాధ్యమా? అని మాజీ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ ప్రశ్నించారు. విధానపరిషత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింధనూరు తాలూకా మల్లదగుడ్డక్యాంపు (మస్కి అసెంబ్లీ క్షేత్రం)లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయచూరు-కొప్పళ జిల్లాల డీసీసీ బ్యాంకుకు చెందిన రూ.650 కోట్లను అప్పటి సీఎం సిద్ధరామయ్య అనుమతితో ఈ రెండు జిల్లాల్లోని 1.52 లక్షల మంది రైతులకు వడ్డీ రహిత రుణాలు అందించారని తెలిపారు. ఎంఎల్‌సీ కాంగ్రెస్‌ అభ్యర్థి శరణేగౌడ బయ్యాపూరు, పంపనగౌడ బాదర్లి ఆ బ్యాంకు డైరెక్టర్లుగా సిద్ధరామయ్య ఇచ్చిన ధైర్యంతో అప్పట్లో ఈ సాహసం చేశారు. ఇదే పని మరెవరైనా చేయగలరా? అని ప్రశ్నించారు. 2016లో ఒక్క సింధనూరులోనే అకాల వర్షాలకు 45 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోగా ఒకే పర్యాయం పర్యటించిన సిద్ధరామయ్య ఆ మరుసటిరోజునే బాధిత రైతులకు రూ.340 కోట్ల పరిహారం అందించారు. ఇవేవీ ప్రస్తుత భాజపా నాయకులు చేయలేరని బాదర్లి అన్నారు. మస్కి ఎమ్మెల్యే ఆర్‌.బసనగౌడ, ఎంఎల్‌సీ అభ్యర్థి శరణేగౌడ కాంగ్రెస్‌ పాలన చూసి ఓట్లేయాలని కోరారు. సింధనూరు, మస్కి క్షేత్రాల్లోని మొత్తం ఏడు గ్రామ పంచాయతీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నాయకులు నల్ల వెంకటేశ్వరరావు, పిన్నమనేని మురళీకృష్ణ, గారపాటి సాయిరామకృష్ణ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని