logo

ఇంజినీరింగ్‌ రుసుములు తగ్గించాలి

పెంచిన ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్‌ రుసుములను తగ్గించాలని కోరుతూ ఏఐడీఎస్‌వో సంఘం శనివారం జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. సంఘం ప్రతినిధులు ఈరణ్ణ, సౌమ్య, రవికిరణ్‌, శాంతి, నింగరాజ్‌, అనుపమా, స్నేహ, స్ఫూర్తి, కార్తీన్‌, మోహన్‌, సంజన తదితరులు

Published : 05 Dec 2021 01:44 IST


జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: పెంచిన ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్‌ రుసుములను తగ్గించాలని కోరుతూ ఏఐడీఎస్‌వో సంఘం శనివారం జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. సంఘం ప్రతినిధులు ఈరణ్ణ, సౌమ్య, రవికిరణ్‌, శాంతి, నింగరాజ్‌, అనుపమా, స్నేహ, స్ఫూర్తి, కార్తీన్‌, మోహన్‌, సంజన తదితరులు స్థానిక గడిగి చెన్నప్ప కూడలి నుంచి డీసీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి పంపాలని కోరారు. రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రవేశ రుసుములు రూ.10 వేలు పెంచడం తగదన్నారు. అకాల వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతుల ఆదాయమార్గం మూసుకుపోయిందన్నారు. నూటికి 80 శాతం మంది రైతుల పిల్లలే ఉండటం వల్ల పెంచిన రుసుములు తగ్గించి విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు