logo

కుదిపేసిన జోరు వాన

ఇటీవలి అకాల వర్షాల నుంచి ఇంకా తేరుకోకమునుపే శుక్రవారం రాత్రి మరోసారి వానదేవుడు దెబ్బతీశాడు. భారీ వర్షాలు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. శుక్రవారం రాత్రి హాసన, మైసూరు, మండ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో రైతులు కకావికలమయ్యారు. చెన్నరాయపట్టణ తాలూకా కెంబాళు

Published : 05 Dec 2021 01:44 IST


చామరాజనగర జిల్లాలో పొలంలోనే మొలకలు వచ్చిన మొక్కజొన్న

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : ఇటీవలి అకాల వర్షాల నుంచి ఇంకా తేరుకోకమునుపే శుక్రవారం రాత్రి మరోసారి వానదేవుడు దెబ్బతీశాడు. భారీ వర్షాలు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. శుక్రవారం రాత్రి హాసన, మైసూరు, మండ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో రైతులు కకావికలమయ్యారు. చెన్నరాయపట్టణ తాలూకా కెంబాళు గ్రామంలో భారీ వర్షాల కారణంగా వర్షం నీటితో రహదారి పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. అరసీకెరె తాలూకా దొడ్డకెరె కట్ట వంద మీటర్ల వరకు కుదించుకుపోయింది. శనివారం ఉదయాన్నే స్థానిక శాసనసభ్యుడు శివలింగేగౌడ ఆ ప్రాంతాన్ని సందర్శించి చెరువు కట్టను బలోపేతం చేసే చర్యలపై అధికారులతో చర్చించారు. మండ్య జిల్లా మల్లేనహళ్లిలో అనేక ఇళ్లు కూలినట్లు సమాచారం అందింది. చామరాజనగర జిల్లాలో ఇంకా పొలం నుంచి మొక్కజొన్న కండెల్ని ఇంటికి తీసుకురాకుండానే కల్లాల్లో అవి మొలకెత్తాయని రైతులు వాపోయారు. అకాల వర్షం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాల్లోకెళ్తే.. నంజనగూడు- 5, పంచనహళ్లి, నుగ్గేనహళ్లి, సుత్తూరు, బెళ్లూరు, మళవళ్లి, హడగలి, శ్రీరాంపుర, భరమసాగర 4, కుందర్గి, బాగలకోటె, అజ్జంపుర, హాసన, కె.ఆర్‌.పెటె, హనకెరె, మండ్య, కొట్టూరు, సంతెబెన్నూరు, సింధగి, యగటి, బేలూరు, శ్రవణబెళగొళ, బిళికెరె, శ్రీరంగపట్టణ, జ్ఞాన భారతి, కనకపుర 2, బీళగి, బబలేశ్వర, ఆలమట్టి, గుబ్బిలో ఒక సెంటీమీటరు చొప్పున వర్షం కురిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు