logo
Published : 05/12/2021 01:49 IST

లారీ- ట్యాంకర్‌ ఢీ.. నలుగురు దుర్మరణం


ప్రమాదంలో నేలపాలైన ఉల్లి బస్తాలు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : బెంగళూరు - పుణె జాతీయ రహదారి డొడ్డసిద్దవ్వనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం గదగ జిల్లా రోణకు చెందిన శరణప్ప (50) అనే రైతు ఉల్లి బస్తాలతో లారీలో బెంగళూరు బయలుదేరారు. చిత్రదుర్గం బైపాస్‌ రహదారి వద్ద వారి వాహనం పంక్చరైంది. వెంటనే డ్రైవర్‌ మంజునాథ్‌ (40) లారీని రోడ్డు పక్కన ఆపి మరో లారీ డ్రైవర్‌ హులగప్ప (35)కు ఫోన్‌ చేసి తనకు జాకీ కావాలని అడిగాడు. క్లీనర్‌ సంజయ్‌ (25) సహాయంతో చక్రాన్ని మారుస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు వివరించారు. లారీలోని ఉల్లి బస్తాలు రోడ్డుపై పడటంతో వాహన సంచారానికి అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాధిక, గ్రామీణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలచంద్రనాయక్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. చిత్రదుర్గం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని