logo

పెళ్లికినిరాకరించాడని యువకుడి ఇల్లు, ఆటోను తగులబెట్టించిన యువతి!

సాధారణంగా యువకులు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన యువతులపై పగబడతారు. బీదర్‌ జిల్లాలో అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బసవకల్యాణ తాలూకా బాగ్‌ హిప్పరగా గ్రామంలో భీమరావు అనే వ్యక్తికి చెందిన ఆటో, నివాసం అగ్నికి ఆహూతి అయ్యాయి.

Updated : 29 Dec 2021 10:05 IST


యువకుడి ఇంట దగ్ధమైన ఆటో

బీదర్‌, న్యూస్‌టుడే : సాధారణంగా యువకులు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన యువతులపై పగబడతారు. బీదర్‌ జిల్లాలో అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బసవకల్యాణ తాలూకా బాగ్‌ హిప్పరగా గ్రామంలో భీమరావు అనే వ్యక్తికి చెందిన ఆటో, నివాసం అగ్నికి ఆహూతి అయ్యాయి. వివరాల్లోకెళ్తే.. చికనాగాంవ్‌కు చెందిన భీమరావు అనే వ్యక్తి కొంతకాలం కిందట సస్తాపూర్‌ గ్రామం సమీపంలో కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆ సమయంలోనే సుమా అనే యువతితో పరిచయం అయింది. తనను వివాహం చేసుకోవాలని సుమా బలవంతం చేస్తూవచ్చిందట. ఆమె ఒత్తిళ్లకు తట్టుకోలేక భీమరావు తన తల్లిని తీసుకుని బాగ్‌ హిప్పరగా గ్రామంలో స్థిరపడ్డారు. తనను వివాహం చేసుకోని పక్షంలో తాను చేబదులుగా ఇచ్చిన రూ.4 లక్షలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆమె డిమాండు చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తనను నిరాకరించాడనే కోపంతో సుమా మనుషులను పురమాయించి భీమరావు ఇంటిని, ఆటోను తగులబెట్టించిందని కేసు నమోదైంది. ముడబి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని