logo

గణతంత్ర వేడుకల్లో కర్ణాటక హస్తకళా వైభవం

న్యూస్‌టుడే: కర్ణాటక హస్తకళా వైభవాన్ని చాటే శకటం ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆకర్షించనుంది. రాష్ట్రంలోని చెన్నపట్టణ బొమ్మలు, కిన్నాళ బొమ్మలు, ఉడుపి చేనేత చీరలతో పాటు దాదాపు 16 రకాల హస్తకళాకృతులతో శకటాన్ని సిద్ధం చేయనున్నారు. 13 సంవత్సరాలుగా కర్ణాటకకు గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే

Published : 17 Jan 2022 04:45 IST

బెంగళూరు(ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: కర్ణాటక హస్తకళా వైభవాన్ని చాటే శకటం ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆకర్షించనుంది. రాష్ట్రంలోని చెన్నపట్టణ బొమ్మలు, కిన్నాళ బొమ్మలు, ఉడుపి చేనేత చీరలతో పాటు దాదాపు 16 రకాల హస్తకళాకృతులతో శకటాన్ని సిద్ధం చేయనున్నారు. 13 సంవత్సరాలుగా కర్ణాటకకు గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తోంది. దక్షిణాదిలో ఈ అవకాశం లభించిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒక్కటే కావడం విశేషం. గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర హస్తకళా వైభవాన్ని చాటుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని