logo

అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు అతివలు

హొసపేటె నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. 2020 అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా ఈ నెల 21న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవిని దళిత మహిళ, ఉపాధ్యక్ష స్థానాన్ని సాధారణ(జనరల్‌) వర్గాలకు కేటాయించారు. మొత్తం 35 మంది

Published : 17 Jan 2022 04:45 IST


సుంకమ్మ

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. 2020 అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా ఈ నెల 21న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవిని దళిత మహిళ, ఉపాధ్యక్ష స్థానాన్ని సాధారణ(జనరల్‌) వర్గాలకు కేటాయించారు. మొత్తం 35 మంది సభ్యుల్లో స్వతంత్రులను కలుపుకొని 20 మంది సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీకే ఈ పదవులు దక్కడం లాంఛనమే. భాజపా నుంచి 4వ వార్డులో గెలిచిన సుంకమ్మ, 23వ వార్డు నుంచి విజయం సాధించిన గంగమ్మ అధ్యక్ష పదవికి అర్హులు. మంత్రి ఆనంద్‌సింగ్‌ అనుగ్రహం మేరకు వీరిద్దరిలో ఒకరు అధ్యక్ష పదవి చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఆనంద్‌సింగ్‌ ఇంటి చుట్టూ వీరు తిరుగుతున్నారు. స్వతంత్రుల మద్దతుతో నగరసభలో అధికారం చేపట్టిన భాజపా, ఆ రుణం తీర్చుకునేందుకు 9మంది స్వతంత్రుల్లో ఒకరికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇది కూడా మంత్రి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

21న ఎన్నికలు: నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నామపత్రాల సమర్పణ, 1.30 గంటలకు పరిశీలన, 2 గంటలకు ఉపసంహరణ, అవసరమైతే 2.10 గంటలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.


గంగమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు