logo

యోగాతో ఆరోగ్య భాగ్యం

కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన కోటి సూర్య నమస్కార శిబిరం హంపీలో ఆదివారం ప్రారంభమైంది. రంజు ఆర్ట్స్‌ యోగా ట్రస్టు వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యోగా ఉపాధ్యాయురాలు బి.పి.రంజాన్‌బీ అభ్యాసకులకు సూర్య నమస్కార యోగాభ్యాసం చేయిస్తున్నారు. రోజూ కనీసం

Published : 17 Jan 2022 04:45 IST


హంపీలోని పాఠశాల ఆవరణలో సూర్యనమస్కార భంగిమలో సాధకులు

హొసపేటె, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన కోటి సూర్య నమస్కార శిబిరం హంపీలో ఆదివారం ప్రారంభమైంది. రంజు ఆర్ట్స్‌ యోగా ట్రస్టు వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యోగా ఉపాధ్యాయురాలు బి.పి.రంజాన్‌బీ అభ్యాసకులకు సూర్య నమస్కార యోగాభ్యాసం చేయిస్తున్నారు. రోజూ కనీసం గంటసేపు యోగా, ప్రాణాయామ చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని రంజాన్‌ బీ తేల్చి చెప్పారు. పిల్లలకు ఇప్పటి నుంచే యోగాభ్యాసం చేయిస్తే చదువులోనూ ముందుంటారని స్పష్టం చేశారు. అన్ని యోగాసనాలకు తల్లిలాంటి సూర్య నమస్కారాన్ని రోజుకి కనీసం 20 సార్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్టు గౌరవాధ్యక్షుడు మోహన్‌ చిక్కభట్‌ జోషి, ప్రధాన కార్యదర్శి వి.విరుపాక్షి, ఫక్రుద్దీన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని