logo

రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ స్థానం

తాలూకాలోని హొస నెల్లుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.కాళికా రాష్ట్రస్థాయి చిత్రపోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల ముఖ్య కార్యాలయం డిసెంబరు 30న విద్యార్థులకు చిత్ర పోటీ నిర్వహించింది. బళ్లారి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన

Published : 17 Jan 2022 04:45 IST


ప్రథమ స్థానంలో నిలిచిన పోస్టర్‌


విద్యార్థిని ఎం.కాళికా

కంప్లి, న్యూస్‌టుడే: తాలూకాలోని హొస నెల్లుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.కాళికా రాష్ట్రస్థాయి చిత్రపోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల ముఖ్య కార్యాలయం డిసెంబరు 30న విద్యార్థులకు చిత్ర పోటీ నిర్వహించింది. బళ్లారి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ పోటీలో విద్యార్థిని కాళికా నమూనా పోలింగ్‌ కేంద్రం చిత్రాన్ని (పోస్టర్‌ను) గీసింది. పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు లీలామూర్తి మార్గదర్శనంలో గీసిన ఈ చిత్రం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. పాఠశాల అభివృద్ధి సమితి సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని