logo

రూ.3.75 కోట్లతో డా.రాజ్‌కుమార్‌ ఉద్యానవనం సుందరీకరణ

డా.రాజ్‌కుమార్‌ ఉద్యానవనాన్ని రూ.3.75కోట్లతో సుందరీకరిస్తున్నట్లు బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార (బుడా) అధ్యక్షుడు పి.పాలన్న కాకర్లకోట పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన బుడా సామాన్య సమావేశం సోమవారం బుడా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి

Published : 18 Jan 2022 01:32 IST


మాట్లాడుతున్న బుడా అధ్యక్షుడు పి.పాలన్న , చిత్రంలో
ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌ అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే: డా.రాజ్‌కుమార్‌ ఉద్యానవనాన్ని రూ.3.75కోట్లతో సుందరీకరిస్తున్నట్లు బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార (బుడా) అధ్యక్షుడు పి.పాలన్న కాకర్లకోట పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన బుడా సామాన్య సమావేశం సోమవారం బుడా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి హాజరైన స్థానిక శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, పాలికె, బుడా అధికారులు సలహా మేరకు పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రధానంగా డా.రాజ్‌కుమార్‌ ఉద్యానవనంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.3.75 కోట్లు కేటాయించారు. తక్షణమే టెండర్లు పిలిచి అభివృద్ధి చేయాలని తీర్మానించారు. డా.రాజ్‌కుమార్‌ ఉద్యానవనం అభివృద్ధి చెందింతే నగర వాసులకు సెలవు రోజులు, సాయంత్రపు వేళల్లో విశ్రాంతి తీసుకోవడంతో పాటు పిల్లలకు అనుకూలంగా ఉంటుందన్నారు. నగరంలో 20 ఉద్యానవనాల అభివృద్ధితోపాటు, జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించారు. నగరంలో పలు కూడళ్లులో వీది దీపాలు వేయాలి. రహదారులు వేయాలని చర్చించారు. నగరంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలైన కొలిమి చౌక్‌, బసవేశ్వరనగర్‌, మరో రెండు ప్రాంతాల్లో నీటిశుద్ధి కేంద్రాలను నిర్మాణానికి అనుమతితోపాటు, నిధులు కేటాయించారు. శివారు ప్రాంతమైన అల్లం భవనం సమీపంలో 100 ఎకరాల్లో కొత్తగా లేఅవుట్‌ అభివృద్ధి చేసి పేదలకు తక్కువ ధరలకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని