logo

నిబంధనల నడుమ గణతంత్ర వేడుక

గణతంత్ర దినోత్సవం అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. వేర్వేరు బృందాలకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం

Published : 18 Jan 2022 01:32 IST


పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పాలనాధికారి

బళ్లారి, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. వేర్వేరు బృందాలకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా పాలనాధికారి సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 26న ఉదయం 9గంటలకు జిల్లా క్రీడామైదానంలో జిల్లా బాధ్యమంత్రి బి.ఎస్‌.ఆనంద్‌సింగ్‌ పతాకావిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు స్థానిక హెచ్‌.ఆర్‌.గవియప్ప కూడలిలోని 150 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం కంటోన్మెంట్‌లోని విమ్స్‌ వైద్య కళాశాల ముందున్న గాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారన్నారు. గణతంత్ర దినోత్సవానికి స్వాగత, ప్రచార, పరేడ్‌, సన్మానం, బందోబస్తు, ఆరోగ్య తదితర సమితులను ఏర్పాటు చేశామని, బాధ్యతలు అప్పగించిన అధికారులు సక్రమంగా నిర్వహించాలని డీసీ పేర్కొన్నారు. ఏడీసీ మంజునాథ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, నగరంలో ప్రముఖ కూడళ్లు, దేవస్థానాలు తదితర ప్రాంతాల్లో 25, 26 తేదీల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించాలన్నారు. వివిధ క్షేత్రాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం చేయాలని సూచించారు. సమావేశంలో కన్నడ, సంస్కృతిశాఖాధికారి సిద్దలింగేశ్‌ రంగణ్ణనవర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని