logo

పదిమందిపై కేసు నమోదు

కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించి హంపీలో శ్రీకృష్ణదేవరాయల జయంత్యుత్సవాన్ని ఆచరించారన్న ఆరోపణపై బెంగళూరు జిల్లాకు చెందిన ఆరుగురు, తుమకూరు జిల్లాలకు చెందిన నలుగురు సందర్శకులపై సోమవారం

Published : 18 Jan 2022 01:32 IST

హొసపేటె, న్యూస్‌టుడే: కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించి హంపీలో శ్రీకృష్ణదేవరాయల జయంత్యుత్సవాన్ని ఆచరించారన్న ఆరోపణపై బెంగళూరు జిల్లాకు చెందిన ఆరుగురు, తుమకూరు జిల్లాలకు చెందిన నలుగురు సందర్శకులపై సోమవారం హంపీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయనగర జిల్లా పోలీస్‌ అధికారి డాక్టర్‌ కె.అరుణ్‌ తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు జిల్లాకు చెందిన పునీత్‌ కెరెహళ్లి, గోపి, అనంతపద్మనాభ, అనిల్‌కుమార్‌, చంద్రకాంత్‌, సచిన్‌, తుమకూరు జిల్లాకు చెందిన హరినాథరెడ్డి, రవికుమార్‌, శశికిరణ, తరుణ్‌లు శ్రీకృష్ణ దేవరాయల జయంత్యుత్సవాన్ని ఆచరించే ఉద్దేశంతో కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసుకున్నారు. నోటి ముసుగులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా హంపీ విరూపాక్ష ఆలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటం చేతపట్టి నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. కొవిడ్‌ నియమాలు అమలులో ఉన్నాయని తెలిసినా ఉల్లంఘించి రాయల జయంత్యుత్సవాన్ని ఆచరించారన్న ఆరోపణపై కేసు నమోదు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని