logo

ఉద్యోగాలకు నకిలీ మకిలి

నకిలీ మార్కుల జాబితాల సాయంతో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 91 మందిపై బెంగళూరు దక్షిణ విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు. నకిలీ మార్కుల జాబితాతో 2017 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు

Published : 18 Jan 2022 01:32 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : నకిలీ మార్కుల జాబితాల సాయంతో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 91 మందిపై బెంగళూరు దక్షిణ విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు. నకిలీ మార్కుల జాబితాతో 2017 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు దక్కించుకున్న మరికొందరి వివరాలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగాలు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది విజయపుర జిల్లాకు చెందిన వారే ఉన్నారని తేలింది. ఇప్పటికే అరెస్టయిన నిందితుల విచారణ కొనసాగుతోంది. సిద్ధాపుర ఠాణాలో పలు కేసులు దాఖలైన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని