logo

‘అధ్యాపకులకు సహకరిస్తా’

అధ్యాపకులకు అన్నివిధాలా సహకారమందిస్తానని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సిద్దు పి.అలగూర్‌ పేర్కొన్నారు. గురువారం వీఎస్కేయూలో అధ్యాపక సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోరాటాన్ని

Published : 21 Jan 2022 06:31 IST


అధ్యాపకుల సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్న ఉపకులపతి సిద్దు పి.అలగూర్‌

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: అధ్యాపకులకు అన్నివిధాలా సహకారమందిస్తానని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సిద్దు పి.అలగూర్‌ పేర్కొన్నారు. గురువారం వీఎస్కేయూలో అధ్యాపక సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోరాటాన్ని న్యాయబద్ధంగా చేపట్టి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సంఘం అధ్యాపకుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. అధ్యాపకులు చిత్తశుద్ధితో సేవలందిస్తూ, విశ్వవిద్యాలయం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నూతన విద్యాచట్టం అమలులో కర్ణాటకలో తొలిస్థానం మన విశ్వవిద్యాలయానిదేనన్నారు. ఇందుకు అధ్యాపకుల సేవలు విలువైనవన్నారు. ఇతర దేశాల్లో పరిశోధనలకు వెళ్లే అధ్యాపకులకు తనవంతు సహకరిస్తానని తెలిపారు. సంఘం అధ్యక్షుడు శాంతనాయక్‌, రిజిస్ట్రార్‌ శశికాంత్‌ ఉడికేరి, డా.కె.సి.ప్రశాంత్‌ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దినేష్‌, ప్రసాద్‌, శశికాంత్‌, డా.కృష్ణారెడ్డి, భీమనగౌడ, డా.అర్చన, డా.సునీల్‌కుమార్‌ డా.కృష్ణబారధ్వాజ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని