logo

పిల్లలకు మందకొడిగా టీకా

నిపుణులు హెచ్చరించినట్లుగానే కరోనా మూడో దశ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనవరి 1 నుంచి 19 వరకు అఖండ బళ్లారి జిల్లాలో మొత్తం 4,244 మందికి కరోనా సోకగా, వారిలో 0-18 ఏళ్ల పిల్లలు 691 మంది ఉన్నారు. వీరిలో తీవ్ర లక్షణాలు కనిపించక పోవడం

Published : 21 Jan 2022 06:31 IST


ఆధార్‌ కార్డులతో బారులు తీరిన విద్యార్థినులు

బళ్లారి, న్యూస్‌టుడే: నిపుణులు హెచ్చరించినట్లుగానే కరోనా మూడో దశ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనవరి 1 నుంచి 19 వరకు అఖండ బళ్లారి జిల్లాలో మొత్తం 4,244 మందికి కరోనా సోకగా, వారిలో 0-18 ఏళ్ల పిల్లలు 691 మంది ఉన్నారు. వీరిలో తీవ్ర లక్షణాలు కనిపించక పోవడం ఊరట కలిగిస్తోంది. వారిని ఇళ్ల వద్దనే ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా వ్యాప్తిలో బళ్లారి తాలూకా అగ్రస్థానంలో ఉండగా, కంప్లి తాలూకాలో తŸక్కువ మంది ఉన్నారు. 
విమ్స్‌ వైద్య విద్యార్థులు సుమారు 60 మంది కొవిడ్‌ బాధితులయ్యారు. ఎర్రంగలి మొరార్జీదేశాయి వసతిగృహంలో ఉంటున్న విద్యార్థుల్లో 46 మందికి వైరస్‌ సోకింది. నగరంలోని బి.ఐ.టి.ఎం ఇంజినీరింగ్‌ కళాశాల, ఎ.ఎస్‌.ఎం. హాస్టల్, ఎస్‌.జి.కళాశాల విద్యార్థులకు వైరస్‌ సోకింది. తాలూకాల వారీగా చూస్తే.. బళ్లారి 248, సిరుగుప్ప 64, సండూరు 68, కంప్లి 9, కురుగోడు 12,   హొసపేటె 177, హగరిబొమ్మనహళ్లి 14, కూడ్లిగి 19, హరపనహళ్లి 21, కొట్టూరు 14, హూవినహడగలిలో 45 మంది పిల్లలకు కరోనా సోకింది.    
టీకా వితరణలో నిర్లక్ష్యం ఎందుకు?
15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి జనవరి 19 నుంచి టీకా వేయాలని నిర్ణయించారు. అఖండ బళ్లారి జిల్లాలో ఈ వయసు పిల్లలు మొత్తం 1,70,344 మంది ఉన్నారు. వారంలోగా వీరికి మొదటి డోసు టీకా ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. జనవరి 3 నుంచి 19 సాయంత్రం 7.30 గంటల వరకు 94,421 మంది (55.4 శాతం)కి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. టీకా కొరత కారణంగా లక్ష్యం మేరకు వేయలేదని బోగట్టా.


ఎర్రంగలి మొరార్జీదేశాయి వసతిశాలలో బాధిత విద్యార్థులకు
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని