logo

కార్మిక సంక్షేమానికి కంకణం

భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అంతర్జాల ఆధారంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విడుదల చేశారు. ఆయన గురువారం ఇక్కడ కర్ణాటక రాష్ట్ర కట్టడ నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి సమావేశంలో పాల్గొని

Published : 21 Jan 2022 06:31 IST


చిరు పుస్తకాన్ని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై,
మంత్రి శివరాం హెబ్బార్‌ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అంతర్జాల ఆధారంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విడుదల చేశారు. ఆయన గురువారం ఇక్కడ కర్ణాటక రాష్ట్ర కట్టడ నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి సమావేశంలో పాల్గొని ఉపకార వేతనాలను విడుదల చేయడంతో పాటు.. సంబంధిత మార్గదర్శకాల చిరు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారి కుటుంబ సభ్యులు ఉన్నత చదువులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బార్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని