logo

క్యాబ్‌ చోదకుల నిరసనబాట

ర్యాపిడ్‌ బైకు ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడంతో తమ క్యాబ్‌లు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బైకు ట్యాక్సీలపై నిషేధాన్ని విధించాలని కోరుతూ డ్రైవర్ల సంఘం సభ్యులు గురువారం నగర వీధుల్లో

Published : 21 Jan 2022 06:31 IST


బెంగళూరు నినాదాలు చేస్తున్న క్యాబ్‌ డ్రైవర్లు

\బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ర్యాపిడ్‌ బైకు ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడంతో తమ క్యాబ్‌లు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బైకు ట్యాక్సీలపై నిషేధాన్ని విధించాలని కోరుతూ డ్రైవర్ల సంఘం సభ్యులు గురువారం నగర వీధుల్లో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. నవంబరు నుంచి నగరంలో క్యాబ్‌ ఎక్కేవారి సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందని ఆందోళనకారులు తెలిపారు. బైకు ట్యాక్సీల్లో వెళ్లే వారికి భద్రత, రక్షణ ఉండదని అభ్యంతరం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని