logo

నెలాఖరు నుంచి నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు

నగరంలో ఈ నెలాఖరు నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తాయని బీఎంటీసీ అధికారులు ప్రకటించారు. 30 బస్సులు ఉత్తరప్రదేశ్‌ నుంచి నగరానికి ట్రాలీ లారీల్లో వచ్చాయి. ఈ బస్సులు అన్ని మార్గాల్లో తిరిగేలా చర్య తీసుకుంటామని తెలియజేశారు. రెండు నెలల కిందట నగర రహదారుల్లో ఎలక్ట్రిక్‌

Published : 23 Jan 2022 00:37 IST


ఉత్తర ప్రదేశ్‌ నుంచి నగరానికి వచ్చిన ఎలక్ట్రిక్‌ బస్సులు

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: నగరంలో ఈ నెలాఖరు నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తాయని బీఎంటీసీ అధికారులు ప్రకటించారు. 30 బస్సులు ఉత్తరప్రదేశ్‌ నుంచి నగరానికి ట్రాలీ లారీల్లో వచ్చాయి. ఈ బస్సులు అన్ని మార్గాల్లో తిరిగేలా చర్య తీసుకుంటామని తెలియజేశారు. రెండు నెలల కిందట నగర రహదారుల్లో ఎలక్ట్రిక్‌ బస్సును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపారు. తరువాత దానికి విశ్రాంతి ఇచ్చారు. కొత్త బస్సులను పరీక్షించిన తరువాత రహదారులపైకి అనుమతిస్తారు. ఏడు గంటలు బస్సు బ్యాటరీలను ఛార్జింగ్‌ చేస్తే 241 కిలోమీటర్లు వినియోగించవచ్ఛు బస్సులు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రారంభంలో వైట్‌ఫీల్డ్‌, కోరమంగల, ఎలక్ట్రానిక్‌ సిటీ, బన్నేరుఘట్ట, అంతర్జాతీయ విమానాశ్రయం రహదారుల్లో ఈ బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని