logo

‘ఉడుపి కళాశాల తీరు అప్రజాస్వామికం

తలపై హిజాబ్‌ (స్కార్ఫ్‌) ధరించారని కర్ణాటకలోని ఉడుపి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముస్లిం విద్యార్థినులను తరగతులకు అనుమతించకపోవడాన్ని ఖండిస్తున్నట్లు షరియా కమిటీ ఫర్‌ ఉమెన్‌, ముస్లిం బాలికల సంఘం, ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ముస్లిం మహిళల

Published : 23 Jan 2022 00:37 IST


చేతిలో ప్లకార్డులతో డా.ఆస్మా జెహ్రా, ఆస్మా జబీన్‌ తదితరులు

నాంపల్లి (హైదరాబాద్‌), న్యూస్‌టుడే: తలపై హిజాబ్‌ (స్కార్ఫ్‌) ధరించారని కర్ణాటకలోని ఉడుపి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముస్లిం విద్యార్థినులను తరగతులకు అనుమతించకపోవడాన్ని ఖండిస్తున్నట్లు షరియా కమిటీ ఫర్‌ ఉమెన్‌, ముస్లిం బాలికల సంఘం, ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ముస్లిం మహిళల హక్కులను కాలరాసేందుకు యత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ న్యూస్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షరియా కమిటీ ఫర్‌ ఉమెన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ ఆస్మా జెహ్రా, కార్యదర్శి ఆస్మా జబీన్‌, ముస్లిం మహిళా సంఘం అధ్యక్షురాలు బుష్రా నదీమ్‌, డాక్టర్‌ నయ్యర్‌ ఫెరోజా తదితరులు మాట్లాడారు. ముస్లిం సంప్రదాయంలో మహిళలు తలపై బురఖా లేదా స్కార్ఫ్‌ ధరించాల్సి ఉంటుందన్నారు. ఇలా ధరించిన విద్యార్థినులను 2021 డిసెంబరు 31న ఉడుపి కళాశాలలో గేటు బయటే అడ్డుకున్నారని తెలిపారు. ముస్లిం విద్యార్థినులు, మహిళల పట్ల జరుగుతున్న చర్యలపై ప్రధాని మోదీ స్పందించి, బాధ్యులపై చర్యలకు ఆదేశాలివ్వాలని.. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని