logo

వైరస్‌ తీవ్రమైతే మరిన్ని కఠిన చర్యలు

కరోనా వైరస్‌ తీవ్రమై ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ స్పష్టంచేశారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సోకినవారు ఆసుపత్రుల్లో తక్కువ సంఖ్యలో చేరుతున్నారని పేర్కొన్నారు.

Published : 23 Jan 2022 00:37 IST

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ తీవ్రమై ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ స్పష్టంచేశారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సోకినవారు ఆసుపత్రుల్లో తక్కువ సంఖ్యలో చేరుతున్నారని పేర్కొన్నారు. నెలాఖరు, ఫిబ్రవరి రెండో వారంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మాస్కు ధరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు విధించబోమన్నారు. కరోనా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఆసుపత్రుల్లో పడకలు, ఐసీయూ, ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి కరోనా పరీక్ష అవసరంలేదని ఐసీఎంఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు