logo

నిజాయతీ దారితప్పితే మౌనంగా ఉండలేను: రూపా

నిజాయతీగా ఉండవలసిన పోలీసు అధికారులే అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించలేనని ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గిల్‌ వ్యాఖ్యానించారు. కంచే చేను మేస్తున్నట్లు తన దృష్టికి వస్తే తక్షణమే బహిర్గతం చేస్తానని చెప్పారు. గతంలోనూ కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన

Published : 23 Jan 2022 00:37 IST

రూపా మౌద్గిల్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: నిజాయతీగా ఉండవలసిన పోలీసు అధికారులే అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించలేనని ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గిల్‌ వ్యాఖ్యానించారు. కంచే చేను మేస్తున్నట్లు తన దృష్టికి వస్తే తక్షణమే బహిర్గతం చేస్తానని చెప్పారు. గతంలోనూ కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయపోరాటమూ చేశానని గుర్తు చేశారు. హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రూపా శనివారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. కొందరు ఐపీఎస్‌ అధికారులు అక్రమాలకు పాల్పడి, ఆస్తులు కూడగట్టుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు తప్పు చేస్తే మరింత కఠిన శిక్ష విధించవలసి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని