logo

‘ఛార్జీల పెంపుపై తొందరపడం’

విద్యుత్తు, నీరు, పాల ధరలు పెంచాలన్న తొందర మాకేం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు అనివార్యతలపై సమగ్రంగా చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ధర లీటరుకు రూ.3 పెంచాలని పాడి సమాఖ్య ప్రతిపాదించింది. శుక్రవారం ఇంధన

Published : 23 Jan 2022 00:37 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: విద్యుత్తు, నీరు, పాల ధరలు పెంచాలన్న తొందర మాకేం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు అనివార్యతలపై సమగ్రంగా చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ధర లీటరుకు రూ.3 పెంచాలని పాడి సమాఖ్య ప్రతిపాదించింది. శుక్రవారం ఇంధన మంత్రి సునీల్‌కుమార్‌ సైతం విద్యుత్తు ఛార్జీల పెంపు అనివార్యమని ప్రకటించారు. జలమండలి, జలవనరులు, నగర, గ్రామీణాభివృద్ధి శాఖలు రూ.12 వేల కోట్లు బకాయిపడిన నేపథ్యంలో ఛార్జీల పెంపు తప్ప మరోమార్గం లేదన్నారు. ప్రజలకు భారమయ్యే పన్నుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తాము ఎవరి ఒత్తిడికి లోనై కర్ఫ్యూను ఉపసంహరించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసులు పెరిగినా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటూ, కోలుకునే వారి ప్రమాణం ఎక్కువగా ఉంది. నిపుణుల సలహాతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకే కర్ఫ్యూ నిబంధనలు అమలు చేసి, ఆపై ఎత్తివేసినట్లు విపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. నిబంధనలు ఎత్తివేసిన వెంటనే వారిపై పన్నుల భారం మోపిందని సర్కారును దుయ్యబట్టారు. సిద్ధరామయ్య చేసిన ఆరోపణలు నిరాధారమని ముఖ్యమంత్రి కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని