logo

కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు

నగరసభ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నామపత్రాలు సమర్పించకుండా చివరి క్షణంలో ఆసుపత్రి పాలైనట్లు నాటకాలాడిన 7వ వార్డు కాంగ్రెస్‌ సభ్యురాలు కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వినాయక శెట్టర్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బ్లాక్‌

Published : 23 Jan 2022 00:37 IST


కనకమ్మ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

హొసపేటె, న్యూస్‌టుడే: నగరసభ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నామపత్రాలు సమర్పించకుండా చివరి క్షణంలో ఆసుపత్రి పాలైనట్లు నాటకాలాడిన 7వ వార్డు కాంగ్రెస్‌ సభ్యురాలు కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వినాయక శెట్టర్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బ్లాక్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నగరసభ సభ్యులు, కార్యకర్తలు 7వ వార్డు సభ్యురాలు అనంతశయనగుడి వాసి కనకమ్మ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వినాయక శెట్టర్‌ మాట్లాడుతూ తమ బలం 12 ఉన్నప్పటికీ అధ్యక్ష పదవికి సభ్యురాలు కనకమ్మను అధిష్ఠానం సూచించింది. ఆమె నామపత్రాలు సమర్పించే సమయంలో ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరారు. ఇది ముమ్మాటికీ ఆమె పార్టీకి చేసిన ద్రోహంగా పరిగణించి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ సమయంలో సభ్యురాలు కనకమ్మ ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. ఆందోళనలో ప్రముఖులు నింబగల్లు రామకృష్ణ, అబుల్‌కలాం ఆజాద్‌, కృష్ణ, మున్నీఖాసీం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని