logo

గణతంత్ర వేడుకకు ఘన సాధన

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కబ్బన్‌ రోడ్డు మానిక్‌ షా పరేడ్‌ మైదానంలో రక్షణ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం సాధన (అభ్యాస) ప్రక్రియను చేపట్టారు. కేఎస్‌ఆర్పీ, శ్వానదశ, అశ్విక దళ సిబ్బంది, సివిల్‌ పోలీసులు, సైనికులు, సైన్యంలోని వివిధ దళాల ప్రతినిధులు కవాతులో

Published : 23 Jan 2022 00:37 IST


మేము సైతం అంటూ శ్వానదళ సిబ్బంది

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కబ్బన్‌ రోడ్డు మానిక్‌ షా పరేడ్‌ మైదానంలో రక్షణ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం సాధన (అభ్యాస) ప్రక్రియను చేపట్టారు. కేఎస్‌ఆర్పీ, శ్వానదశ, అశ్విక దళ సిబ్బంది, సివిల్‌ పోలీసులు, సైనికులు, సైన్యంలోని వివిధ దళాల ప్రతినిధులు కవాతులో పాల్గొన్నారు. రక్షణ శాఖ, పోలీసు సిబ్బంది తమ అధునాతన వాహనాలను ప్రదర్శించారు. కొవిడ్‌ మూడో అలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవానికి గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ మైదానంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి సందేశమిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా పరిమిత సంఖ్యలో అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. సిబ్బంది అందరికీ స్వాబ్‌ పరీక్ష నిర్వహించి, నెగెటివ్‌ నివేదిక వచ్చిన వారినే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మైదానాన్ని పాలికె సిబ్బంది శుభ్రం చేసి, రక్షణ శాఖకు అప్పగించారు. ఆసనాలను శానిటైజ్‌ చేసే ప్రక్రియను ఆరోగ్య శాఖ సిబ్బంది చేపట్టారు.


లఫె్ట్‌..రైట్‌.. లఫె్ట్‌..రైట్‌


సాయుధదళం పదసంచలనం


ఆసనాలను శుభ్రపరుస్తున్న కార్మికుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని