logo

‘మా పెళ్లికి రావద్దు’.. ఉన్న చోటు నుంచే ఆశీర్వదించండంటూ అభ్యర్థన

‘బంధుమిత్ర సపరివారంగా తప్పకుండా పెళ్లికి రావాల’ని ఆహ్వానించడం చూస్తుంటాం. అయితే చామరాజనగర జిల్లాలోని ఓ యువ జంట ‘‘తమ పెళ్లికి దయచేసి రావద్ధు. ఉన్న చోటు నుంచే ఆశీర్వదించండ’’ంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులు, స్నేహితులు, ఇతర ఆత్మీయులను

Updated : 23 Jan 2022 09:00 IST

శ్రేయస్‌, సుష్మా

చామరాజనగర, న్యూస్‌టుడే: ‘బంధుమిత్ర సపరివారంగా తప్పకుండా పెళ్లికి రావాల’ని ఆహ్వానించడం చూస్తుంటాం. అయితే కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో ఓ యువ జంట ‘‘తమ పెళ్లికి దయచేసి రావద్దు. ఉన్న చోటు నుంచే ఆశీర్వదించండి’’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులు, స్నేహితులు, ఇతర ఆత్మీయులను అభ్యర్థించారు. ఇక్కడికి సమీపంలోని వి.సి.హోసూరు గ్రామస్థురాలు సుష్మా, చెన్నప్పనపురకు చెందిన శ్రేయస్‌ల వివాహం శని, ఆదివారాల్లో నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి వివాహ ఆహ్వానపత్రికల్ని అందించారు. కరోనా ప్రబలడంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటే వైరస్‌ మరింత విజృంభించే ప్రమాదం ఉంటుందని భావించి తమ పెళ్లికి ఎవ్వరూ రావద్దంటూ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ, అభ్యర్థన పత్రాన్ని కూడా పంపారు. వధువు సుష్మా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ‘‘మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. అందుకే పెళ్లికి రాకుండా ఇళ్లలో నుంచే ఆశీర్వదించాల’’ని వేడుకున్నారు. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని