logo

కర్ఫ్యూ సడలించినా..కానరాని సంచారం

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా....వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని వారాంతపు కర్ఫ్యూను జిల్లా పాలనాధికారి కొద్దిగా సడలింపు చేసినా....జనం బయటకు రావడం లేదు. దీంతో నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. సినిమా థియేటర్లుకు 50 శాతం

Published : 23 Jan 2022 00:37 IST


బోసిపోయిన బెంగళూరు రహదారి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా....వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని వారాంతపు కర్ఫ్యూను జిల్లా పాలనాధికారి కొద్దిగా సడలింపు చేసినా....జనం బయటకు రావడం లేదు. దీంతో నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. సినిమా థియేటర్లుకు 50 శాతం సీట్లతో ప్రదర్శనకు అవకాశం కల్పించినా 30 శాతం కూడా ప్రేక్షకులు రావడం లేదని థియేటర్‌ లీజ్‌దారుడు లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. కొత్త సినిమాలు విడుదల చేయకపోవడం, కరోనా భయంతో జనం ముందుకు రావడంలేదన్నారు. దుస్తులు, గార్మెంట్స్‌, చెప్పుల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, కిరాణా, పండ్లు, కూరగాయల మారెట్లలో జనం కనిపించడం లేదు. పాఠశాలలు ప్రారంభించడానికి డీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మొదటి రోజు ప్రారంభం కాలేదు. కరోనా మూడో దశ ప్రభావంతో పాటు, వాతావరణంలో మార్పులతో ప్రతి ఇంటిలో జలుబు, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా తల్లిదండ్రులు పాఠశాలకు ఇప్పట్లో పంపించే పరిస్థితులు కనిపించడం లేదు. భోజనశాలలు తెరిచినప్పటికీ వినియోగదారులు రావడంలేదు. బెంగళూరు, కాళమ్మ, తేరువీధి, దొడ్డ మార్కెట్‌, ఎ.పి.ఎం.సి. కూడలి, పార్వతీనగర్‌, డబుల్‌ రహదారి, అనంతపురం, వాల్మీకి, హెచ్‌.ఆర్‌.గవియప్ప కూడలి, తదితర ప్రాంతాల్లో జనం ఎప్పుడు రద్దీగా కనిపించే వారు. వారాంతపు కర్ఫ్యూను సడలించినా జనం పలుచగా కనిపించారు. కరోనా భయంతో పాటు, రెండు వారాలుగా వారాంతపు కర్ఫ్యూ ఉండటంతో సడలింపు తెలియక ప్రజలు బయటకు రాలేదు. శనివారం వ్యాపారం పెద్దగా జరగలేదని వ్యాపారి రామాంజినేయులు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.


మీనాక్షి కూడలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని