logo

మహిళా విశ్వవిద్యాలయం విస్తరణకు చర్యలు

ఉత్తర కర్ణాటక అభివృద్ధికి అనుగుణంగా ఆ ప్రాంతంలోని యువతులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రారంభించిన విజయపుర మహిళా విశ్వ విద్యాలయాన్ని మూసివేసే ప్రశ్నే లేదని జలవనరుల మంత్రి గోవింద కారజోళ తెలిపారు. వర్సిటీని మూ

Published : 25 Jan 2022 04:37 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఉత్తర కర్ణాటక అభివృద్ధికి అనుగుణంగా ఆ ప్రాంతంలోని యువతులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రారంభించిన విజయపుర మహిళా విశ్వ విద్యాలయాన్ని మూసివేసే ప్రశ్నే లేదని జలవనరుల మంత్రి గోవింద కారజోళ తెలిపారు. వర్సిటీని మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. విధానసౌధలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విశ్వవిద్యాలయంలో అన్ని జిల్లాల యువతులూ చదువుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మూసివేస్తారంటూ వస్తున్న వదంతులను విశ్వసించవలసిన అవసరం లేదన్నారు.

విజయపురలోని అక్కమహాదేవి మహిళా విశ్వవిద్యాలయాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యా మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ వెల్లడించారు. ఆ ప్రాంగణంలోని సంస్కృత విశ్వ విద్యాలయం కొత్త ప్రాంగణంలోకి మారుతుందని తెలిపారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమకాలీన ప్రపంచంలో మహిళా సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు వర్సిటీ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని