logo

జస్టిస్‌ శెట్టి పదవీవిరమణ

రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వనాథశెట్టి సోమవారం తన పదవీవిరమణను ప్రకటించారు. ఆయన పదవీ కాలం ఈ నెల 27 వరకు ఉంది. కొత్త న్యాయమూర్తిని ప్రభుత్వం ఎంపిక చేసుకునేందుకు అనువుగా తాను పదవీ విరమణను ప్రకటించానని చెప్పారు. తన

Published : 25 Jan 2022 04:37 IST

విలేకరుల సమావేశంలో జస్టిస్‌ విశ్వనాథశెట్టి

 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వనాథశెట్టి సోమవారం తన పదవీవిరమణను ప్రకటించారు. ఆయన పదవీ కాలం ఈ నెల 27 వరకు ఉంది. కొత్త న్యాయమూర్తిని ప్రభుత్వం ఎంపిక చేసుకునేందుకు అనువుగా తాను పదవీ విరమణను ప్రకటించానని చెప్పారు. తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒత్తిడికి తలొగ్గకుండా, తన పరిధికి వచ్చిన కేసులన్నింటినీ వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అవినీతి నియంత్రణ దళం (అనిద) ఏర్పాటు చేసిన తర్వాత లోకాయుక్తపై భారం తగ్గిందన్నారు. ప్రతి జిల్లాలో చెరువుల కబ్జా కేసుల దర్యాప్తు చురుకుగా కొనసాగుతోందని తెలిపారు. లోకాయుక్తకు పరిమిత అధికారాలు ఉండడంతో పలు కేసులను నేరుగా దర్యాప్తు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని