logo

నందిహళ్లి పీజీ కేంద్రంలో విద్యార్థులకు కరోనా

బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చే సండూరు తాలూకా నందిహళ్లి పీజీ కేంద్రంలో మరో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. పీజీ కేంద్రంలో మొత్తం 59 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లయింది.

Published : 25 Jan 2022 04:37 IST


వసతి గృహం ముందు ఆరోగ్య, సమాజ కల్యాణశాఖాధికారులు, సిబ్బంది

 

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చే సండూరు తాలూకా నందిహళ్లి పీజీ కేంద్రంలో మరో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. పీజీ కేంద్రంలో మొత్తం 59 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లయింది. సండూరు తాలూకా నందిహళ్లి పీజీ కేంద్రంలో రెండు రోజులు ముందు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో సండూరు తాలూకా ఆరోగ్యశాఖాధికారులు పీజీ కేంద్రాకి చేరుకొని 110 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా, వారిలో కరోనా వైరస్‌ సోకినట్లు వెలుగులోకి వచ్చింది. మిగిలిన విద్యార్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా, మరో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. సమాజ కల్యాణశాఖాధికారులు, ఆరోగ్య శాఖాధికారులు పీజీ కేంద్రంలోకి వసతి గృహాలతో పాటు, కళాశాల ఆవరణ, తరగతి గదులను రసాయన ద్రావణంతో పిచికారీ చేశారు. వసతి గృహాలను సీల్‌డౌన్‌ చేశారు. వైద్యులు కుశాల్‌, భారత్‌, ఇతర ఆరోగ్య సిబ్బంది పీజీ కేంద్రంలో ఉంటూ విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని