logo

మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి

మహిళా అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలకు సైతం ఉన్నత విద్య అందించాలని కంప్లి పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా సూచించారు. కంప్లి చక్కెర కర్మాగార ప్రాంతంలోని ముక్తినాథేశ్వర కల్యాణ మంటపంలో సోమవారం సాయంత్రం డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సేవా

Published : 25 Jan 2022 04:37 IST


జ్యోతి వొెలిగించి సమితిని ప్రారంభిస్తున్న అతిథులు

కంప్లి, న్యూస్‌టుడే: మహిళా అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలకు సైతం ఉన్నత విద్య అందించాలని కంప్లి పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా సూచించారు. కంప్లి చక్కెర కర్మాగార ప్రాంతంలోని ముక్తినాథేశ్వర కల్యాణ మంటపంలో సోమవారం సాయంత్రం డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సేవా సమితిని ఆమె నూతనంగా ప్రారంభించి మాట్లాడారు. సమితి సభ్యులు ప్రజల సమస్యలపై స్పందించాలి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సమితి అధ్యక్షురాలు రబియా నిసార్‌ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల కోసమే సమితి ఏర్పడిందన్నారు. కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు పి.బ్రహ్మయ్య, హొన్నూర్‌ సాబ్‌, రామకృష్ణ, హేమవతి పూర్ణచంద్ర, ఉషా, పుష్పలత పాల్గొన్నారు.

ఆడపిల్లలను గౌరవిద్దాం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ఎక్కడ మహిళలను గౌరవిస్తామో అక్కడ శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని స్వామీ వివేకానంద వ్యక్తిత్వ వికాస సంస్థ అధ్యక్షుడు కె.జె.నరసింహులు పేర్కొన్నారు. పట్టణంలోని 5వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జాతీయ ఆడపిల్లల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆడపిల్లలను ఎంతగానో గౌరవించి ఆరాధిస్తాం, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగుతున్నారన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నరసింహులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని