logo

ప్రసూతి కేంద్రం నిర్మాణ స్థలంపై అభ్యంతరం

సింధనూరులో నిర్మించ తలపెట్టిన ప్రసూతి కేంద్రం సమస్య జటిలంగా మారుతోంది. బుధవారం రాష్ట్ర యువ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు బసనగౌడ బాదర్లి, ఇతర కాంగ్రెస్‌ నాయకులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇది పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని,

Published : 27 Jan 2022 00:39 IST


మంత్రి శంకర్‌ బి.పాటిల్‌కు వినతిపత్రం అందిస్తున్న భాజపా నాయకులు

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరులో నిర్మించ తలపెట్టిన ప్రసూతి కేంద్రం సమస్య జటిలంగా మారుతోంది. బుధవారం రాష్ట్ర యువ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు బసనగౌడ బాదర్లి, ఇతర కాంగ్రెస్‌ నాయకులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇది పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని, చుట్టూ శ్మశానాలు, వెళ్లే దారి సవ్యంగా లేదని, ఈ స్థలాన్ని మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుక ముగించుకుని సింధనూరు మీదుగా వెళ్తున్న రాయచూరు నూతన బాధ్య మంత్రి శంకర్‌.బి.పాటిల్‌ మునేకొప్పను స్థానిక భాజపా నాయకులు కొద్దిసేపు నిలిపి ప్రసూతి కేంద్రం అంశంపై వినతిపత్రం అందించారు. భాజపా తాలూకా అధ్యక్షుడు హనుమేశ్‌, సిద్ధు హూగార్‌, వీరరాజు తదితరులు మంత్రితో మాట్లాడుతూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని తెలిపారు. స్థానిక పీడబ్ల్యూడీ క్యాంపులోని నీటిపారుదల శాఖలో విశాలమైన స్థలం ఉన్నందున ఇక్కడ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని