logo

వివాహానికి తీపి ఆహ్వానం

సంగానట్టి సేంద్రియ బెల్లం.. బాగల్‌కోటె జిల్లాతోపాటు దేశ, దేశాల్లో పేరొందిన ఉత్పత్తి! ఇక్కడ తయారయ్యే సేంద్రియ బెల్లం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సేంద్రియ పద్ధతుల్లో బెల్లం తయారీని చేపట్టడమే కాకుండా వివిధ రకాల రుచులు, పరిమాణాల్లో అందుబాటులోకి తెస్తున్నారు.

Published : 27 Jan 2022 00:39 IST


సేంద్రియ బెల్లం తయారీని పరిశీలిస్తున్న ఓ అధికారిణి

బాగలకోటె, న్యూస్‌టుడే : సంగానట్టి సేంద్రియ బెల్లం.. బాగల్‌కోటె జిల్లాతోపాటు దేశ, దేశాల్లో పేరొందిన ఉత్పత్తి! ఇక్కడ తయారయ్యే సేంద్రియ బెల్లం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సేంద్రియ పద్ధతుల్లో బెల్లం తయారీని చేపట్టడమే కాకుండా వివిధ రకాల రుచులు, పరిమాణాల్లో అందుబాటులోకి తెస్తున్నారు. యువ రైతు మహాలింగప్ప ఇట్నాల్‌ ఈ రంగంలో సాధించిన ప్రగతి ప్రశంసలకు పాత్రమైంది. ఆయన చేపట్టిన సేంద్రియ బెల్లం తయారీని ప్రశంసిస్తూ రాజస్థాన్‌కు చెందిన లాల్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ ఓ ప్రయోగం చేశారు. తమ ఇంట్లో వివాహానికి ఆహ్వాన పత్రికలతో కలిపి సంగానట్టి సేంద్రియ బెల్లాన్ని అందించాలని నిర్ణయించారు. సాధారణంగా రాజస్థాన్‌లో వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు మిఠాయిని అందించడం సంప్రదాయం. ఈసారి మిఠాయిలకు బదులుగా సేంద్రియ బెల్లాన్ని అందించాలని నిర్ణయించారు. ఒక్కో అచ్చు 250 గ్రాముల బరువుండేలా నాలుగు క్వింటాళ్ల బెల్లానికి ఆయన ఆర్డర్‌ ఇచ్చారని మహాలింగప్ప తెలిపారు బెళగావి విమానాశ్రయంలో తమ బెల్లం ఉత్పత్తులతో ఔట్‌లెట్‌ను నిర్వహించేందుకు ఆహ్వానం లభించిందన్నారు. ఇటీవలే విమానాశ్రయం అధికారులు సంగానట్టిలోని బెల్లం తయారీ యూనిట్‌ను సందర్శించి ఈ మేరకు ఆహ్వానం అందించారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని