logo

ఫిరాయింపులకు భయపడం: కుమార

జనతాదళ్‌ నుంచి మా పార్టీలోకి నాయకులు వస్తున్నారని కాంగ్రెస్‌, భాజపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు భయపడబోమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. భాజపాకు జనతాదళ్‌ తోక అని విపక్ష నేత చేసిన

Published : 27 Jan 2022 00:39 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : జనతాదళ్‌ నుంచి మా పార్టీలోకి నాయకులు వస్తున్నారని కాంగ్రెస్‌, భాజపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు భయపడబోమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. భాజపాకు జనతాదళ్‌ తోక అని విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకుంటానని అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీగా జనతాదళ్‌ ప్రజా సమస్యల పరిష్కారానికే శ్రమిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దళ్‌ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, భాజపాలకు చెందిన నాయకులు తనను కోరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ జాతీయ పార్టీలు ఇస్తున్న హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని తెలిపారు. కొవిడ్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటల్లిందని చెప్పారు. సమస్యల సుడిలో చిక్కుకున్న 4.4 కోట్ల కార్మికుల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పేదలు, శ్రామికులు, మహిళల సమస్యలను పరిస్కరిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఏ పార్టీలోనూ సిద్ధాంతాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం నిజాయతీపరులను దూరం పెట్టడం దురదృష్టకరమన్నారు.

కొత్త సమితి ఏర్పాటు
మాజీ మంత్రి బండప్ప కాశంపూర్‌ నేతృత్వంలో కొత్త కేంద్ర సమితిని దళ్‌ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి ఎన్‌.ఎం.నబిని రాష్ట్ర కార్యాధ్యక్షునిగా ప్రకటించింది. సమితిలో సభ్యులుగా వెంకటరావు నాడగౌడ, సి.ఎస్‌.పుట్టరాజు, ప్రజ్వల్‌ రేవణ్ణ, కుపేంద్రరెడ్డి, మహ్మద్‌ ఝఫ్రుల్లా ఖాన్‌, ఎం.కృష్ణారెడ్డి, రాజా వెంకటప్ప నాయక, బి.ఎం.ఫారూఖ్‌, కె.ఎ.తిప్పస్వామి, వై.ఎస్‌.వి.దత్త, కె.ఎం.తిమ్మరాయప్ప, టి.ఎ.శరవణ, శారాదా పూర్యనాయక్‌, రుత్‌ మనోరమ, నాసిర్‌ భగవాన్‌, హనుమంతప్ప బసప్ప మామిన మరద, సుధాకర్‌ శెట్టి, వి.నారాయణ స్వామి, సమృద్ధి మంజునాథ్‌ ఉంటారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, పార్టీ అధ్యక్షుడు హెచ్‌.కె.కుమారస్వామి ప్రత్యేక ఆహ్వానితులుగా, రాజా వెంకటప్ప నాయక దళ్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటారని కుమారస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని