logo

రెండు జిల్లాల్లో కరోనా వ్యాప్తి తీవ్రం

కరోనా మొదటి దశలో 1,100 కేసులు దాటడానికి 65 రోజులు పట్టగా, రెండో దశలో 50 రోజుల్లోనే ఆ సంఖ్య కేసులు నమోదయ్యాయి. మూడో దశలో కేవలం 26 రోజుల్లోనే ఆ మార్కు దాటిందంటే వైరస్‌ వ్యాప్తి వేగం ఎలా

Published : 27 Jan 2022 00:39 IST

బళ్లారి, న్యూస్‌టుడే: కరోనా మొదటి దశలో 1,100 కేసులు దాటడానికి 65 రోజులు పట్టగా, రెండో దశలో 50 రోజుల్లోనే ఆ సంఖ్య కేసులు నమోదయ్యాయి. మూడో దశలో కేవలం 26 రోజుల్లోనే ఆ మార్కు దాటిందంటే వైరస్‌ వ్యాప్తి వేగం ఎలా ఉందో అర్థమవుతుంది. అఖండ బళ్లారి జిల్లాలో మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 3,929 నమూనాలు పరీక్షించగా, 1141 మందికి వైరస్‌ సోకింది. బళ్లారి జిల్లాలో 594, విజయనగరలో 547 కేసులు నమోదయ్యాయి. తాలూకాల వారీగా.. బళ్లారి-291, సండూరు-178, హొసపేటె-159, హూవినహడగలి-158, సిరుగుప్ప-94, కూడ్లిగి-82, హగరిబొమ్మనహళ్లి-79, హరపనహళ్లి-63, కంప్లి-23, కురుగోడు-8, కొట్టూరులో ఆరు కేసులు నమోదయ్యాయి. బళ్లారి, సండూరు తాలూకాల్లో కరోనా నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. విజయనగర జిల్లాలోని హొసపేటె, హూవినహడగలిలోనూ మహమ్మారి వేగం పుంజుకుంది. రెండు జిల్లాల్లో తాజాగా 518 మంది కోలుకున్నారు. బళ్లారిలో 3,997 విజయనగరలో 2,171 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా 10,984 మందికి టీకా వేసినట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ కల్యాణశాఖాధికారి డా.జనార్దన్‌ తెలిపారు.  
ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి వైరస్‌
హొసపేటె: హరపనహళ్లి శాసనసభ్యుడు గాలి కరుణాకరరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సలహా మేరకు బళ్లారి నివాసంలో క్వారంటైన్‌ అయ్యాను. ఆరోగ్యం నిలకడగా ఉంది. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన కార్యకర్తలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని