logo

ప్రజలకు ఆరోగ్యరక్ష

ఆరోగ్య సూచికలో కర్ణాటకను ముందంజలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో పౌష్ఠికాహార సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించి, పరిష్కరించేందుకు

Published : 27 Jan 2022 00:39 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఆరోగ్య సూచికలో కర్ణాటకను ముందంజలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో పౌష్ఠికాహార సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నాటికి నీతి ఆయోగ ఆరోగ్య జాబితాలో టాప్‌- 3 స్థానంలో ఉండడమే తక్షణ లక్ష్యమని తెలిపారు. బెంగళూరులో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండగా, మైసూరు, హాసన, దక్షిణ కన్నడ తదితర జిల్లాల్లో నిదానంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనన్నారు. కఠిన నియమావళిని అనుసరిస్తే మరో రెండు వారాల్లో కేసులు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాకు కొత్త జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రితో చర్చించి, నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించారు. చిక్కబళ్లాపుర జిల్లా వ్యవహారాల బాధ్యతలు తప్పడంతో స్థానిక కార్యకర్తలు నిరాశకు గురయ్యారని తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు నాయకులు అందరూ కట్టుబడడం తప్పనిసరి అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని